అనుకోకుండా, రా.తె.స! వారి సభలకు ఆహ్వానం వచ్చింది. షిరిడీలో ఈసారి మీటింగ్స్ అని చెప్పారు.
Janaki Prabhala ప్రభల జానకి అక్క, “రమా! నేను వెడుతున్నాను, నీ సంగతేంటి?” అంటూ మేసేజ్ చేసారు. “మీతో పాటు వస్తాను” అని చెప్పాను.
తరువాత ఆమె కతార్ వెళ్లారు. నేను కూడా సందిగ్ధంలో ఉన్నాను… ఆమె కతార్ నుంచి వచ్చి టిక్కెట్స్ తీసుకుంటూ నాకు చెప్పారు. వారితో పాటు నాకు కూడా టిక్కెట్స్ తీసుకోమని చెప్పాను.
కానీ, సప్త శృంగి అమ్మవారికి మొక్కు ఉంది నాకు. ఆ విషయం కూడా చెప్పాను.
ఈ అమ్మవారితో నాకు ఒక అనుభవం ఉంటుంది. నాకు ఎదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మవారికి చెప్పుకుంటాను. అలాగే అబ్బాయికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒకరాత్రి అంతా ఆమెకే విన్నవించుకున్నాను. నా తలమీద, మా అబ్బాయి వెన్నుమీద తడిమినట్లు అనిపించింది నాకు. అలాగే అబ్బాయికి ఆరోగ్యాన్నిచ్చింది కదా! మరి చల్లని తల్లికి వచ్చి చెప్పాలి కదా! అందుకే, అక్క సభల గురించి చెప్పగానే ఆ దంపతులతో పాటు వచ్చేసాను.
అక్క ఈ అమ్మవారి గురించి వినలేదుట… అయినా నేనడగానే ఆ దంపతులు ఇరువురు ఓపికగా మాతో పాటు వచ్చారు. ముగ్గురం కలిసి ఏడు మేరువులలా ఉండే కొండలమధ్య ఉన్న ఆ తల్లిని దర్శించుకున్నాము.
దారి పొడుగునా ఉన్న ద్రాక్ష, బంతి, సీతమ్మవారి జడలు (ముఖమల్) పువ్వుల తోటలు చూసుకుంటూ సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు చూస్తూ నిన్నటి మా ప్రయాణం ఆహ్లాదంగా సాగింది.
ఇవాళ రా. తె. స ల సభలకు వెళ్ళి స్నేహితులను కలవటం ఇవాల్టి ముఖ్య కార్యక్రమం!
Mannem Sarada గారు అదే విషయం… షిరిడీ నుంచి సప్త శృంగి వెల్లెవరకు దారంతా గోదావరి నది, పచ్చని జొన్న, చెరుకు, పత్తి, ఉల్లి, బంతిపూలు, ద్రాక్ష తోటలతో, ఎత్తైన కొండలతో రోడ్లు గతుకులున్నా బోర్ కొట్టకుండా సాగే ప్రయాణం ఇది.
ఫోటోలు, ఎప్పుడు వెళ్ళినా అందంగా ఆహ్వానించే రహదారులు, చల్లగా ఆహ్వానించే అమ్మవారు. ఇవే నిన్న మీరు చూసిన ఫోటోలు.