సుర్ఖండ్ మాత ఆలయం గురించి నాకు తెలిసిన చిన్న సమాచారం.

51 శక్తి పీఠాల్లో ఒకటి. డెహ్రాడూన్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శివ పురాణంలో చెప్పిన సంఘటనల్లో చాలా ముఖ్యమైన చోటు ఇది. చంబా లోయ ఉన్న పర్వతప్రాంతం. 2600 మీటర్ల ఎత్తైన పర్వతం మీద చుట్టూ మంచుపర్వతాలతో ఒక ఆధ్యాత్మిక సంపదతో విలసిల్లుతున్న ప్రాంతం ఇది.

సతీ అమ్మవారి శరీరం చిద్రమైన తరువాత అమ్మవారి శరీరం నుంచి తలభాగం విడివడిన స్థలంగా మా గురువుగారు చెప్పారు. శిర్ ఖండ్ అనే మాట ఇక్కడ యుగయుగాలుగా రూపాంతరం చెంది సుర్ ఖండు గా మారిందని చెప్పారు. పంచ కేదార్ క్షేత్రాలు దర్శించుకునే సమయంలో మనకు కనిపించేవి ఇవన్నీ!

శివ పార్వతులు కళ్యాణం చేసుకున్న చోటు బదరీ క్షేత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే వారు మొదట కాపురం ఉన్న స్థలం టెహరీ కూడా ఈ సుర్ ఖండ్ దగ్గరలోనే ఉంటుంది. ఈ అందాలను వర్ణించటానికి మాటలే ఉండవు. అది అనుభూతి చెందవలసిన ప్రాంతం. అతి శక్తివంతమైన శక్తి క్షేత్రం! కొంతదూరం వరకూ కార్లో, వెళ్ళి, అక్కడినుంచి గుర్రాలమీద వెళ్లిరావచ్చును. రోప్ వే కూడా ఉన్నది. రోప్ వే లో వెళ్ళేటప్పుడు మొత్తం పర్వతశ్రేణులు చూడటం ఒక మంచి అనుభవమే!

సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఆ అందం వర్ణించ వీలుకానిది. వీలైతే జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలసిన ఆలయం ఇది.

Categorized in: