ఈ ఆలయం శివ శక్తీ విష్ణు ముగ్గురు ఉండే చోటు.

రుద్రప్రయాగ జిల్లాలో, త్రియుగ్నారాయణ్ అనే ఊరిలో, ఉండే ఆలయం. మూడు యుగాలు పూర్తయి నాలుగవ యుగంలో ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న అగ్ని గుండంతో ఉంటుంది. అన్నీ యుగాలు చూసిన సాక్షిగా, దేవతలున్నారు ఇక్కడ, శివపార్వతి విష్ణుమూర్తి ముగ్గురూ ఉన్నారు అనటానికి గుర్తే ఈ అగ్ని అని చెబుతారు.

ఈ ఆలయ స్థల పురాణంగా అదే చెబుతారు. శివపార్వతుల కళ్యాణానికి విష్ణు మూర్తి సారథ్యం వహించాడట!

విష్ణుమూర్తి వెలిగించిన అగ్నిహోత్రం చుట్టూ శివపార్వతులు ఇరువురు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారట. వారు అగ్నికి ప్రదక్షిణ నమస్కారం చేసిన చోటుగా వర్ణించి చెబుతారు.

ఇక్కడి ప్రకృతి అందం గురించి వర్ణించలేము. మేము వెళ్ళిన సమయాల్లో ఒకసారి ఆపిల్ చెట్లు పిందెలతోనూ, మరొకసారి ఎద్దపెద్ద కాయలతోనూ ఉన్నాయి. చెట్టునుంచి ఆపిల్ కోసుకుతిన్న చోటు ఇదే మొదటిసారి.

ఈ ఆలయం చార్ ధాం యాత్ర చేసే వారందరూ దర్శించి వస్తారు. చాలా మందికి తెలిసిన ఆలయమే ఇది. తెలియని వారు తెలుసుకుని చూడవలసిన ఆలయం ఇది.

Categorized in: